విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు TDP 23 సీట్లు మాత్రమే ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే 3 ఎంపీ స్థానాలను ఇస్తున్నట్లు సమాచారం అందుతోంది. నిజానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 175లో 35 స్థానాలు కోరగా.. జనసేనకు 23 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు టీడీపీ సిద్ధపడినట్లు తెలిసింది. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా కొంతవరకూ సమ్మతి తెలిపారనీ, ఐతే.. మరోసారి చర్చలు జరిపి, మరిన్ని సీట్లు కోరాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. మరి జనసేన పోటీ చేస్తున్న స్థానాల లిస్ట్ ఇదేనా?
మనకు అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీ కింది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. 01. తెనాలి
2. భీమిలి 03. నెల్లిమర్ల 04. విశాఖ నార్త్ లేక సౌత్ 05. చోడవరం లేక అనకాపల్లి 06. పెందుర్తి 07. పిఠాపురం 08. కాకినాడ 09. రాజోలు 10. P. గన్నవరం 11. రాజానగరం 12. రాజమండ్రి (రూరల్) 13. అమలాపురం 14. నరసాపురం 15. భీమవరం 16. తాడేపల్లిగూడెం 17. ఏలూరు లేదా కైకలురు 18. దర్శి 19. పెడన 20. అవనిగడ్డ 21. విజయవాడ వెస్ట్ 22. రాజంపేట 23. తిరుపతి లేక చిత్తూరు ఈ అసెంబ్లీ స్థానాలు దాదాపు ఖాయం అయినట్లు తెలిసింది. ఇంకా. అనంతపురం, ధర్మవరం, ఆళ్లగడ్డ స్థానాలను కూడా జనసేన కోరుతోంది. నెల్లూరు జిల్లాలో ఒక సీటును కోరుతున్నట్లు సమాచారం. ఇంకా గోదావరి జిల్లాలలో మరో 3 సీట్లు జనసేనకు ఇవ్వవచ్చని తెలుస్తోంది.
Admin
Viswas Tv