Sunday, 13 September 2026 01:44:51 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

చంద్రబాబుకు పొత్తు కొత్త చిక్కులు.....

Date : 18 January 2023 08:02 AM Views : 1047

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా జిల్లా : జ‌న‌సేన‌తో పొత్తు చ‌ర్చ‌ల నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కొత్త చిక్కులు ఎదుర‌వుతున్నాయి. గ‌త కొంత కాలంగా నియోజ‌క వ‌ర్గాల వారీగా చంద్ర‌బాబు స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ, అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు డోన్‌, న‌గ‌రి, క‌డ‌ప‌, రాజంపేట లోక్‌స‌భ అభ్య‌ర్థుల‌తో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలంద‌రికీ తిరిగి సీట్లు ఇస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికి 120కి పైగా నియోజ‌క‌వ‌ర్గాల‌పై సమీక్షించార‌ని స‌మాచారం. చంద్ర‌బాబు త‌న స‌హ‌జ ధోర‌ణికి విరుద్ధంగా ఎంతో ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అయితే జ‌న‌సేన‌తో పొత్తు అంశం తెర‌పైకి రావ‌డంతో టీడీపీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు బ్రేక్ ప‌డిన‌ట్టు స‌మాచారం. ఇవాళ్టి నుంచి మ‌ళ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చంద్ర‌బాబు స‌మీక్ష‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. క‌డ‌ప‌, నంద్యాల‌, భీమ‌వ‌రం, రాజోలు త‌దిత‌ర నియోజ‌క వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌తో ఆయ‌న పార్టీ స్థితిగ‌తుల‌పై ఆరా తీయ‌నున్నారు. అయితే ఇంత‌కు ముందులా వెంట‌నే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం సాధ్యం కాద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం, గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల నుంచి జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోటీ చేసి ఓట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు పొత్తు ఉంటుంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించ‌డంతో సీట్ల‌పై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ముఖ్యంగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాంటి చోట ముందే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తే కొత్త స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నే భ‌యం చంద్ర‌బాబును వెంటాడుతోంది. ఇక‌పై ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌న‌సేన‌కు టికెట్ కేటాయించే అవ‌కాశం లేద‌నే నియోజ‌కవ‌ర్గానికి మాత్ర‌మే అభ్య‌ర్థిని చంద్ర‌బాబు ప్ర‌క‌టిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మిగిలిన చోట్ల పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై బాబు దిశానిర్దేశం చేస్తార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: