Sunday, 13 September 2026 01:45:00 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

బీజేపీ లో పదవులు చిచ్చు, తారాస్థాయికి చేరిన గొడవలు....

Date : 05 January 2023 11:13 PM Views : 980

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బీజేపీలో జిల్లాల అధ్యక్ష పదవుల మార్పు కలకలం సృష్టిస్తోంది.. ఇటీవలే ఆరు జిల్లాలకు అధ్యక్షులను మార్చేశారు బీజేపీ ఏపీ చీఫ్‌ సోము వీర్రాజు.. మార్చిన జిల్లాల అధ్యక్షులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పదవులు కట్టబెట్టారు.. అయితే, ఏకపక్షంగా పదవులను మార్చారంటూ పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు నేతలు.. పార్టీ పదవికి రాజీనామా చేశారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శ్రీకాకుళం జిల్లా ఇంఛార్జ్‌ చిగురుపాటి కుమారస్వామి.. కృష్ణా జిల్లాలోని వివిధ విభాగాల పదవులకు రాజీనామాలు చేశారు పలువురు నేతలు. పార్టీ పదవులకు రాజీనామా చేశారు అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట నగేష్‌, రెడ్డి నారాయణరావు.. రాష్ట్ర పార్టీ చీఫ్‌ సోము వీర్రాజు ఒంటెత్తు పోకడల వల్లే పదవులకు రాజీనామాలు చేస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం వాదనగా ఉంది.. మరిన్ని రాజీనామాలు ఉంటాయంటూ ప్రచారం కూడా సాగుతోంది. అయితే, పార్టీ విధానాలను అనుసరించే పదవుల్లో మార్పులు చేర్పులు చేశామని చెబుతోంది ఏపీ బీజేపీ.. జిల్లా అధ్యక్షులుగా ఉన్న వాళ్లకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం ప్రమోషన్‌ అని చెప్పుకొస్తున్నారు. కన్నా లక్ష్మీ నారాయణను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. జాతీయ కార్యవర్గ సభ్యుడుగా తీసుకున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది సోమువీర్రాజు వర్గం.. ఇప్పుడు రాజీనామా చేశానని చెప్పుకుంటున్న తోట నగేష్‌.. రెండు నెలల క్రితమే పార్టీ పదవికి రాజీనామా చేశారని పార్టీ అధినాయకత్వం అంటోంది. చిగురుపాటి కుమారస్వామి రాజీనామా మినహా.. మిగిలిన వారి రాజీనామాలేవీ పార్టీ అధిష్టానానికి చేరలేదంటున్నారు.. పార్టీ నుంచి వీలైనంత త్వరగా బయటకెళ్లాలనుకునే వారు తెర వెనుక ఉండి.. రాజీనామాల ఎపిసోడ్‌ నడిపిస్తున్నారని సోము వర్గం ఫైర్‌ అవుతోంది.. ఏపీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.. ఆయా పార్టీల జిల్లాల అధ్యక్షుల పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు చేశామని చెబుతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.. జిల్లా అధ్యక్షులతో.. జోనల్ ఇంఛార్జీల సంప్రదింపులు జరిపాకే మార్పులు జరిగాయని స్పష్టం చేస్తున్నారు.. వేరే ఉద్దేశ్యాలు ఉంటే కన్నా లక్ష్మీనారాయణ మారిన వెంటనే జిల్లా అధ్యక్షులను మార్చేసేవాళ్లం కదా? అంటూ ప్రశ్నలు సందిస్తోంది సోము వీర్రాజు వర్గం.. మారిన జిల్లాల అధ్యక్షులెవరూ పార్టీ పదవులకు రాజీనామా చేయలేదని ఏపీ బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు.. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో బీజేపీ నేతల తీరు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :