Wednesday, 19 November 2025 07:06:02 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

కానిస్టేబుల్ బర్రి రమేష్ హత్య కేసులో సినిమాను మించిన రోజుకో కొత్త ట్విస్ట్ లు....... ,

Date : 05 August 2023 07:02 PM Views : 3228

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖపట్నం కానిస్టేబుల్ బర్రి రమేష్ హత్య కేసులో సినిమాను మించిన ట్విస్టులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రియుడితో శాశ్వతంగా జీవించేందుకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలన్న ఉద్దేశంతో అతడిని భార్య శివానీ అలియాస్ శివ జ్యోతి హతమార్చి గుండెపోటుగా చిత్రీకరించిందని అనుకున్నారు. కానిస్టేబుల్ బర్రి రమేష్ హత్య కేసులో సినిమాను మించిన ట్విస్టులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రియుడితో శాశ్వతంగా జీవించేందుకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలన్న ఉద్దేశంతో అతడిని భార్య శివాని అలియాస్ శివ జ్యోతి హతమార్చి గుండెపోటుగా చిత్రీకరించిందని అనుకున్నారు. కానీ ఈ కుట్ర వెనుక మరో కోణం ఉందని తెలిసి విస్తుపోయారు పోలీసులు సైతం. ప్రియుడు రామారావు, అతడి స్నేహితుడు నీలా, శివజ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మరొకరి పేరు బయటకు వచ్చింది. అసలు ఆమె ప్రియుడు రామారావుతో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి ఆ వ్యక్తే కారణమైనట్లు శివానీ చెబుతుంది. ఇంతకు ఆమె ఎవరంటే..?

శివానీ పెద్దమ్మ కూతురు పైడమ్మ. శివానీకి అక్క వరుసైన పైడమ్మ ద్వారానే రామారావు పరిచయమనట్లు పోలీసులకు వెల్లడించింది. ఈ హత్య కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్ విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. అతడికి కొన్నాళ్ల క్రితం శివానితో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. ప్రస్తుతం ఎంవీపీ కాలనీలో ఆదర్శ్ నగర్‌లో నివాసముంటున్నారు. వీరి ఎదురింట్లోనే టాక్సీ డ్రైవర్ రామారావు నివసిస్తున్నాడు. శివజ్యోతి ఇంటి పక్కనే కారు పార్కింగ్ చేసేవాడు. అలా వారికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ భర్తకు దొరికిపోవడంతో.. రామారావుతో కలిసి ఉండాలని శివానికి చెప్పడంతో.. కొన్నాళ్లు బయటకు వెళ్లి జీవించారు. అయితే పెద్దలు నచ్చచెప్పడంతో తిరిగి రమేష్‌తో కాపురానికి ఓకే చెప్పింది. వచ్చిన తర్వాత కూడా అతడితో గొడవ పడుతూ.. పిల్లలను తనకు ఇవ్వాలంటూ వాదించేది.

దీనికి రమేష్ ససేమీరా అనడంతో అతడి అడ్డుతొలగించుకోవాలని అనుకుంది. దీనికి ప్రియుడు రామారావుతో కలిసి స్కెచ్ వేసింది. తన బంగారాన్ని తాకట్టు పెట్టి లక్షన్నర అతడికి ఇచ్చింది. రామారావు.. తన స్నేహితుడు నీలాకు రమేష్‌ను చంపేందుకు సుఫారీ ఇచ్చాడు. ఈ నెల 1వ తేదీన ఇంటికి వచ్చిన భర్తకు శివాని మందు తాగించి, వాటిని వీడియో తీసింది. భర్త నిద్రలోకి జారిపోగానే రామారావు, నీలాలను పిలిచింది. నీలా రమేష్ మొహంపై దిండు అదిమిపెట్టి చంపేయగా.. శివానీ కాళ్లు పట్టుకుంది. రామారావు ఎవ్వరూ రాకుండా బయట కాపలా కాశాడు. అయితే భర్త చనిపోతుండగా కూడా వీడియో తీసింది శివానీ. అనంతరం స్క్రీన్ ప్లేను అప్లై చేసింది. పొద్దున్నే లేచేసరికి భర్త అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని, గుండెపోటుతో చనిపోయినట్లు బంధువులను నమ్మించింది. అయితే అనుమానం వ్యక్తం చేసిన రమేష్ అన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించగా.. ఊపిరాడక పోవడంతోనే చనిపోయినట్లు తెలిపింది. శివానినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అక్క పైడమ్మ ద్వారానే రామారావు పరిచయమయ్యాడని, మేము ముగ్గురం కలిసి బయటకు వెళ్లినట్లు చెప్పింది. ప్రియుడితో అక్కకు పరిచయం ఉందని తెలిపింది. ఫోన్ డేటాను పరిశీలించిన పోలీసులు ముగ్గురు తరచూ కాన్ఫరెన్స్ కాల్స్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. అంతేకాకుండా తనకు కట్నం కింద ఇచ్చిన ఆస్థితో పాటు సాధారణంగా చనిపోతే భర్త ఉద్యోగం కూడా తనకు వస్తుందన్న అత్యాశతో.. అతడిని చంపి, గుండె పోటుతో చిత్రీకరించానని చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, కావాలనే శివాని తనను ఇరికిస్తుందని పైడమ్మ వాపోతుండటం విశేషం. ఆమెను కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చి..విచారించే అవకాశాలున్నాయి.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :