Friday, 16 January 2026 03:57:24 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

ఫస్ట్ నైట్ రోజు, స్థానం చేస్తుండగా నవ వధువు మృతి.....

Date : 02 February 2023 09:01 AM Views : 1064

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : మీరట్‌లో గ్యాస్ గీజర్ లీక్ కావడంతో ఊపిరాడక నవవధువు మృతి చెందింది. గ్యాస్ గీజర్ ఎలా ఉపయోగించలి..? గ్యాస్ గీజర్ అమర్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? సురక్షితంగా అనుసరించాల్సిన చిట్కాలను ఇక్కడ మనం తెలుసుకుందాం...

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటనలో నవ వధువు మృతి చెందింది. పెళ్లి జరిగిన మరునాడే ఈ ఘటన జరిగింది. ఆ నవ వధువు స్నానం చేసేందుకు తన అత్తమామల ఇంట్లోని బాత్‌రూమ్‌కి వెళ్లింది. చాలా సేపు అక్కడే ఉంది. ఎంతకూ బాత్‌రూమ్ నుంచి రాకపోవడంతో కుటుంబ సభ్యులు డోర్లు పగల గొట్టి చూడటంతో అసలు విషయం తెలిసింది.బాత్‌రూమ్‌లోని ఓ మూలలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించారు. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.నవ వధువు మృతికి కారణం ఇదే.. నవ వధువు మ‌ృతిరి కారణాలను వైద్యులు విశ్లేషించారు. ఇందులో.. గ్యాస్ గీజర్‌లు కార్బన్ మోనాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఇది పీల్చిన కొద్ది నిమిషాల్లోనే మృత్యువొడిలోకి జారుకుంటారు. ఈ గ్యాస్ చాలా ప్రమాదకరమైనది. ఈ గ్యాస్ పీల్చిన మరుక్షణమే మైకంలోకి జారుకుంటారు. ఆ తర్వాత అపస్మారక స్థితిని వెళ్లిపోతారు. అయితే వెంటనే గుర్తించి వైద్యులకు చూపిస్తే ప్రాణాలు రక్షించే అవకాశం ఉంది.

గ్యాస్ గీజర్లను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఏంటి? గ్యాస్ గీజర్ల వాడకం మూర్ఛ వ్యాధికి దోహదపడిందని గతంలో చెప్పేవారు. అయితే, గ్యాస్ గీజర్‌ని ఉపయోగిస్తున్నవారు తప్పకుండా వారు వినియోగిస్తున్న బాత్‌రూమ్‌లో బాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవలి. మంచి గాలి వచ్చే బాత్‌రూమ్‌లో మాత్రమే స్నానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, చాలా సందర్భాలలో కొన్ని నెలలపాటు ఉపయోగించే యాంటీ-సీజర్ మందులతో చికిత్స చేయవచ్చు. ఐదు నిమిషాలకు పైగా గ్యాస్‌ను పీల్చడం వల్ల తలతిరగవచ్చు. ఇది ఎక్కువసేపు ఉంటే ముందుగా స్పృహ కోల్పోవచ్చు.. ఆ తర్వాత ఊపిరాడక చనిపోవచ్చు.గ్యాస్ గీజర్‌ను సురక్షితంగా ఎలా ఉపయోగించాలి? గ్యాస్ గీజర్‌ను సురక్షితంగా ఉపయోగించడానికి వైద్యులు ఈ క్రింది చిట్కాలు.. గీజర్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ఏవైనా లీక్‌లు ఉంటే వెంటనే సరిచేయాలి. గీజర్ ఉన్న బాత్‌రూమ్‌లో తప్పకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవలి. గీజర్ పని చేస్తున్నప్పుడు దాన్ని ఆన్ చేయండి. లీక్ ఉంటే ఉపయోగించవద్దు బాత్రూంలో కనీసం ఒక కిటికీ ఉండేలా చూసుకోండి మీకు ఊపిరాడినట్లు అనిపించినా లేదా ఒక్క సెకను కూడా దగ్గడం ప్రారంభిస్తే.. వెంటనే కాస్త స్వచ్ఛమైన గాలిని పొందడానికి బయటకు వెళ్లండి....

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :