Wednesday, 19 November 2025 07:06:00 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

జగన్ పార్టీ పనైపోయింది.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడి?????

Date : 26 August 2023 07:56 AM Views : 3108

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : గత వారం ఐ ప్యాక్ చేసిన ఓ సర్వే లీక్ అయినట్లుగా సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. అది లీక్ కాబట్టి వైసీపీ నేతలు అది ఫేక్ అంటూ పెద్ద గొంతు పెట్టుకుని అరిచి చెప్పారు. కానీ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే చానల్ ప్రకటించిన సర్వే తాజాగా వెలువడింది. ఆ సర్వే కూడా వైసీపీ డిక్లైన్ ను విస్పష్టంగా తేల్చేసింది. ఇండియా టుడే చానల్ ప్రతి ఆరు నెలలకోసారి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వేలు వెలువరిస్తుంది. తాజా సర్వేలో ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. కనీసం పదిహేను లోక్ సభ సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని విస్పష్టంగా పేర్కొంది. ఈ సర్వే కేవలం లోక్ సభ సీట్ల గురించే చెప్పింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలుగుదేశం ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉంటుందని, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలలో బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీగా ఉండబోయేది తెలుగుదేశం మాత్రమేనని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కుండబద్దలు కొట్టేసింది. ఈ సర్వేపై తమకు విశ్వాసం లేదని వైసీపీ చెప్పుకునే అవకాశం ఇసుమంతైనా లేదు. ఎందుకంటే ఇదే ఇండియా టుడే.. ఏడాది కిందట నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తెలుగుదేశం పార్టీకి కేవలం ఏడు లోక్ సభ సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంది. అప్పుడు వైసీపీ శ్రేణులు, నాయకత్వం ఆ సర్వేను ఓన్ చేసుకుని ఎన్నికల నాటికి తెలుగుదేశం సీట్లు మరిన్ని తగ్గిపోతాయనీ, పాతికకు పాతిక లోక్ సభ స్థానాలూ తమ ఖాతాలోనే పడతాయని ప్రకటనలు గుప్పించాయి. దాని ప్రాతిపదికగానే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైనాట్ 175 అంటూ లోక్ సభ స్థానాలలాగే అసెంబ్లీ స్థానాలనూ వంద శాతం గెలుచుకుంటామని చెప్పారు. ఆ తరువాత ఇప్పటి వరకూ ఆ వైనాట్ 175 మంత్రాన్నే వల్లె వేస్తూ వస్తున్నారు. ఆరు నెలల కిందట ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తెలుగుదేశం పార్టీకి పది లోక్ సభ స్థానాలను ఇచ్చింది. ఇప్పుడు తాజా సర్వేలో ఆ సంఖ్య 15కు పెరిగింది. అయితే ఈ సర్వేకు సంబంధించి ఒక్క విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే పొత్తుల ప్రశక్తి లేకుండా నిర్వహించిన సర్వే. అంటే పొత్తులు లేకుండానే తెలుగుదేశం పార్టీ పాతిక లోక్ సభ స్థానాలలో 15 గెలుచుకుంటుంది. ఐ ప్యాక్ సర్వేలో కూడా అదే చెప్పింది. ఇటీవల టైమ్స్ నౌ చానల్ తో.. ప్రతీ నెలా ఓ సర్వే వస్తోంది. అందులో ఇరవై ఐదు సీట్లూ వైసీపీకే వస్తాయని వేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లోనూ వైసీపీ పట్టు జారిపోయిదని స్పష్టమయింది. తమ సిట్టింగ్ పంచాయతీలు, కంచుకోటల్లోనే ఓడిపోయింది. పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ప్రభుత్వంపై అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో జగన్ రెడ్డి గ్రాఫ్ దారుణంమగా కరిగిపోతోంది. ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. రాష్ట్రంలో దిగజారుతున్న జగన్ గ్రాఫ్ ను బట్టి చూస్తే ఎన్నికల నాటికి వైసీపీ కనీసం ఒక్కటంటే ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా దక్కించుకోలేని పరిస్థితికి దిగజారినా ఆశ్చర్యం లేదని పరిశీలకలు అంటున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :