విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా జిల్లా : ఏపీకి కొత్తగా వచ్చిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులను సీఎం జగన్ దంపతులు కలిశారు. ముఖ్యమంత్రి దంపతులు గురువారం విజయవాడలోని రాజ్ భవన్‌కు వెళ్లి వారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీకి కొత్త గవర్నర్‌గా రేపు (ఫిబ్రవరి 24) అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
Admin
Viswas Tv