Monday, 14 September 2026 03:25:31 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

ఏపీఎస్ ఆర్టీసీ కి 141కోట్ల ఆదాయం, ఆర్టీసీ లాభాలు పండగ.....

Date : 17 January 2023 09:34 PM Views : 1000

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా జిల్లా : *ఏపీఎస్ఆర్టీసీకి లాభాల పండుగ*ఈ సంవత్సరం రూ. 141 కోట్ల ఆదాయం* *సంక్రాంతి ప్రత్యేక సర్వీసులను విశేషంగా ఆదరించిన ప్రయాణీకులు* *తిరుగు ప్రయాణానికి తగినన్ని బస్సులు ఏర్పాటు. *ఈ సంవత్సరం 1,483 ప్రత్యేక బస్సులను నడిపిన ఆర్టీసీ* *ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు..... *విజయవాడ,: సంక్రాంతికి ముందు రోజుల్లో జనవరి 6 నుండి 14 వరకు ఏపీఎస్ ఆర్టీసీ రికార్డు స్థాయిలో 3,392 ప్రత్యేక బస్సులు నడిపింది. సంక్రాంతికి ముందు రోజుల్లో 3120 ప్రత్యేక బస్సులను నడపాలని యోచిస్తున్నట్లు ఏపీఎస్ 16న మీడియా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. సాధారణ ఛార్జీలకే తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నందున ఏపీ, తెలంగాణ, తదితర ప్రాంతాల ప్రజలు ప్రైవేట్ బస్సుల కంటే, ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. తిరుగు ప్రయాణ టిక్కెట్ ఛార్జీపై 10శాతం రాయితీ సౌకర్యం కూడా ప్రయాణికులను ఏపీఎస్ వైపు ఆకర్షించేలా చేసింది. గత సంవత్సరం ఏపీఎస్ సంక్రాంతి ముందు రోజుల్లో 2,400 ప్రత్యేక బస్సులను మాత్రమే నడిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు ‘సాధారణ ఛార్జీలు’ వసూలు చేయడం వల్ల ప్రయాణికులు ఇతర వాహనాలను ఆశ్రయించకుండా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులకే ఎక్కువ మొగ్గు చూపారు. దీని ఫలితంగా స్థూల ఆదాయం బాగా పెరిగింది. గత సంవత్సరం సాధించిన ఆదాయం రూ . 7.17 కోట్లుతో పోలిస్తే, ఈ సంవత్సరం 50% అదనపు ఛార్జీలు లేకుండానే అదనంగా రూ. 7.90 కోట్ల ఆదాయం ఆర్జించడం జరిగింది. కాగ, గత ఏడాది ఇవే రోజుల్లో సాధించిన రూ.107 కోట్ల ఆదాయం కంటే ఈ సంవత్సరం రూ. 141 కోట్ల ఆదాయం ఏపీఎస్ ఆర్టీసీ సాధించగలిగిందని ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.ఏపీఎస్ ఆర్టీసీ , గత ఏడాది హైదరాబాదు నుండి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు 824 బస్సులు నడపగా, ఈ సంవత్సరం 1,483 ప్రత్యేక బస్సులను నడిపింది. హైదరాబాద్లో సరైన మౌలిక సదుపాయాలు లేనప్పటికీ పెద్ద ఎత్తున బస్సులు నడిపి, ప్రయాణికుల నుండి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ప్రత్యేక సర్వీసులను నిర్వహించగలిగింది. కాగా ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇతర అంతఃరాష్ట్రాలకు వెళ్లే తిరుగు ప్రయాణికుల కోసం రద్దీని బట్టి ముందస్తు సీట్ల రిజర్వేషన్ కల్పిస్తూ, బస్సులు నిరంతరం అందుబాటులో ఉంచడం జరిగింది. సంక్రాంతి ముందు రోజుల్లో ఏపీఎస్ ఆర్టీసీ సేవలను విశేషంగా ఆదరించినందుకు ప్రయాణికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ అంతటా అన్ని ప్రదేశాల నుండి తగిన సంఖ్యలో తిరుగు ప్రయాణం కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసినందున ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ఆదరించి మా సేవలను పొందడం కొనసాగించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :