Sunday, 13 September 2026 01:45:36 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

మాజీ మంత్రి,కాంగ్రస్ సీనియర్ నేత, వట్టి వసంత కుమార్ కన్నుమూత.

Date : 29 January 2023 12:10 PM Views : 1089

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీలో వట్టి సుదీర్ఘ కాలం పని చేసారు. వైఎస్ కు సన్నిహితుడుగా ఉండేవారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించారు. కొంత కాలంగా ఆయన విశాఖలో నివాసం ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. వట్టి వసంత కుమార్ 2004,2009 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వట్టి వసంత్‌కుమార్‌ స్వస్థలం ప.గో.జిల్లా పూండ్ల.వట్టి వసంతకుమార్ కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేత. వైఎస్ కేబినెట్ లో 2009లో మంత్రిగా వ్యవహరించారు. ఆ తరువాత రోశయ్య..కిరణ్ కుమార రెడ్డి కేబినెట్ లోనూ మంత్రిగా పని చేసారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కినా..పోర్టుఫోలియో కేటాయింపు సమయంలో వట్టి వార్తల్లో నిలిచారు. ఆ తరువాత కిరణ్ కు మద్దతుగా వ్యవహరించారు. ఈ మధ్య కాలంలో జరిగిన కాపు సమావేశాల్లోనూ వట్టి హాజరయ్యారు. కిరణ్ కేబినెట్ లో టూరిజం శాఖా మంత్రిగా వట్టి బాధ్యతలు నిర్వహించారు.

మూడేళ్ల క్రితం వసంతకుమార్ సతీమణి కన్నుమూసారు. పిల్లలు లేకపోవటంతో బంధువుల నుంచి ఒకరిని దత్తత తీసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో వట్టి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014 లో రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నా.. క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. విశాఖ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన వట్టి వసంతకుమార్ భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :