విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : తొమ్మిదేళ్లలో బీజేపీ కేంద్రoలో అధికారoలో ఉండి సాదించన అభివృద్ధి ఏంటి అని ఏపీ బిఆర్ ఎస్ నాయకులు డాక్టర్ లెక్కల శ్రీనివాస్, సన్యాసిరాజు, మూర్తి, ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ, ఉత్తరాoద్ర,రాయలసీమ వెనకబడిన 7జిల్లాలు కు ప్రత్యేక ప్యాకెజి ,పోలవరం నిధులు, విధులు ఏమి అయ్యాయి అని బిఆర్ ఎస్ నాయకులు అడగారు. కేంద్ర ప్రభుత్వo, పని అంతా ప్రైవేట్ మయo అని, BSNL,విశాఖ స్టీల్ ప్లాంట్,పోర్ట్,LIC, ఇవన్నీ అంబానీ, అదాని కి దార దత్తo చేసి ఈరోజు విశాఖ వచ్చి కేవలం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్యరటన చెప్పటానికి వస్తున్నారా అని లెక్కల శ్రీనివాస్ నిలదీశారు. స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర మీడియా తో మాట్లాడతున్న సమయoలో పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ లు తీసుకు వెళ్లారు. ప్రజా స్వామ్య వాదులు గొంతు నొక్కడo బీజేపీ కి అలవాటు అని బిఆర్ ఎస్ నాయకులు ఎద్దవా చేసారు...
Admin
Viswas Tv