విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖపట్నం: పతాకం న్యూస్: డీజే శబ్దానికి విశాఖ ఎన్ఏడి లో ఓ వ్యక్తి మృతి....... వినాయక నిమజ్జనాలలో అపసృతులు... పరుదులు దాటి.... డీజే ల మోతలు.... డాన్స్ బేబీ డాన్స్ అంటూ కార్యక్రమాలు.. అధిక శబ్ద ధ్వనులు... చిన్నారుల్లో వృద్ధుల్లో ఆందోళన..... అధిక ధ్వని కాలుష్యానికి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది మంది మృతి.... అధిక శబ్ద తరంగాలు.... మృత్యువాతలు...... అధిక శబ్దాల డీజే లను నిషేధించాలి...... కార్యక్రమంలో రౌడీ షీటర్ల హల్చల్.... కుర్ర కారు జోరు, ఆనందం ఆహ్లాదం పరిమితులు దాటతే ఏమవుతుందో నేటి యువత తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వినాయక చవితి మహోత్సవాలలో తమ భక్తి భావాలను యువత చాటుకోవచ్చు ఎందుకంటే వినాయక చవితి అనేసరికి ప్రతి గల్లీ గల్లీలో యువకులతో పాటు చిన్న పిల్లలు కూడా ఈ పండుగను ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇది రాను రాను యువతలో మరింత ప్రేరేపిత హింసలకు పాల్పడడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో వినాయక మండపాలు ఎక్కువగా నిర్వహించడంతో స్థానిక పోలీసులు నిర్వాహకులకు పలు అవగాహన సదస్సుల ఏర్పాటుతోపాటు, స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధిక శబ్దాలు వెలువరించే మైకులు డి జే ల ను వినియోగించరాదు అంటూ ప్రభుత్వ నిబంధనలను విధిస్తున్నప్పటికీ అవి ఏవి పాటించకపోవడం స్థానిక పోలీసులకు సమస్యలను సృష్టిస్తున్నాయి. అధిక శబ్ద కాలుష్యం.....ప్రస్తుతం రాష్ట్రంలో వినాయక నిమజ్జనాల్లో డీజే లను వినియోగించుకోవచ్చునని కానీ వాటికి కొన్ని నిబంధనలను వర్తిస్తాయి అంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న, వాటిని పెడ చెవిని పెడుతూ యువత పరిమితులు దాటుతూ గత రెండు రోజుల క్రితం అధిక శబ్దానికి తాజాగా శనివారం విశాఖపట్నం ఎన్ఏడి ప్రాంతంలో వినాయక నిమజ్జనంలో భాగంగా డీజే అధిక సబ్ద కాలుష్యానికి ఓ వ్యక్తి మరణించడం జరిగింది. అదేవిధంగా గత కొద్దిరోజుల క్రితం అనంతపురంలో ఓ యువకుడు ఈ డిజేల , ధ్వనులకు గుండె రక్తనాళాలు ఒక్కసారిగా దెబ్బ తినడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇదేవిధంగా మరొక ప్రాంతంలో ఓ మహిళ ఈ అధిక శబ్ద కాలుష్యానికి గుండె చప్పుడు ఆగిపోవడంతో ఆమె కూడా మృతి చెందింది.
Admin
Viswas Tv