Wednesday, 28 October 2026 05:54:51 AM
# విశాఖ మేయర్ అభ్యర్థిగా వరదు కళ్యాణే బెస్ట్,బీవీ రామ్ నా మద్దతి కళ్యాణి గారికే # అవినీతి రాజకీయ నాయకుడు చేతి నుండి ప్రభుత్వ భూమిని కాపాడిన సిపిఎం నేత వెంకన్న, విశ్వాస్ టీవీ # జీవీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ ముక్కా శ్రావణి # దేవరాపల్లి జడ్పీటీసీ రెసులో ముచ్చటగా 8మంది!!పోటీ మాత్రం ఇద్దురు మధ్య!! # ఒకే ఇంట్లో నాలుగు పదవులు,!!అవును బాస్ # అనకాపల్లి జడ్పీ పీఠం ఎవరికి వరించెనో !!! అధిష్టానం దగ్గర దరఖాస్తు చేసుకున్నది నలుగురు అని సమాచారం!! # విశాఖ టిడిపి మేయర్ ఆభ్యర్థిగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని , మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోడలు మధ్య గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం!!! వైసి # 20లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రెవిన్యూ అధికారులు # విశాఖ మేయర్ కుర్చీ కోసం ముగ్గురు మాజీ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య పోరు....! # విశాఖ మేయర్ పీఠం కూటమిలో కాక!! గండి బాబ్జి వైపే అధిష్టానం చూపు # పెదపూడి సమస్యపై పీవీఎస్‌ఎన్‌ రాజు నిరవధిక నిరసన దీక్ష, కూటమిలో ఉంటూ కూటమికి చుక్కలు చూపిస్తున్న జనసేన నేత! # అనకాపల్లి జిల్లా టీడీపీ జడ్పీ చైర్మన్ పదివి రెసులో నలుగురు మధ్య తీవ్రపోటీ # ఒకవైపు డీజే ల మోత...... మరోవైపు మృత్యువాత # పోస్ట్ చిన్నది పైల్ కథ చాలా పెద్దది పరవాడలో దారుణం # 1980s ట్రెండ్ అదిరింది, జాగర్తగా ఉండవలిసిందే # *ఎ.యస్.యం ఇపార్క్ కు గోండుపాలెంలో భూసేకరణ ఆపాలని, మద్యత్తర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు* # వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!!

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరదు కళ్యాణే బెస్ట్,బీవీ రామ్ నా మద్దతి కళ్యాణి గారికే

వరదు కళ్యాణితో భేటీ అయిన తెలుగుశక్తి 9రకాల డిమాండ్స్

Date : 27 October 2026 10:16 AM Views : 61

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖపట్నం, అక్టోబర్ 26: విశాఖ నగర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా తెలుగు శక్తి సంస్థ తొమ్మిది ప్రధాన డిమాండ్లను తెరపైకి తెచ్చింది. ఈ డిమాండ్ల అమలుపై స్పష్టమైన హామీ ఇస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం విశాఖపట్నంలోని హోటల్ మేఘాలయలో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి, విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు కే.కే.రాజును కలిసి ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. నగర భవిష్యత్తు, మౌలిక సదుపాయాలు, పారదర్శక పాలనకు సంబంధించిన అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేయడంతో పాటు, అమలు ప్రణాళిక, కాలపరిమితిని ప్రకటించాలని కోరారు. తెలుగు శక్తి తొమ్మిది ప్రధాన డిమాండ్లు 1. సింహాచలం కొండల పరిరక్షణ: కొండల సహజ స్వరూపాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. 2. ప్రభుత్వ భూముల పరిరక్షణ: ఎకరాకు 99 పైసల చొప్పున కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలి. 3. గీతంకు కేటాయించిన 58 ఎకరాలు: ఈ భూములకు సంబంధించి జీవీఎంసీ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి. 4. తాగునీరు, మౌలిక సదుపాయాలు: నగర ప్రజల అవసరాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. 5 .విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ: స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు కృషి చేయాలి. 6.పర్యావరణ పరిరక్షణ: పర్యావరణానికి హాని కలిగించే డేటా సెంటర్ల ఏర్పాటును నివారించాలి. 7.జీవీఎంసీలో అవినీతి నిర్మూలన: అవినీతిని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. 8.రూ.4,000 కోట్ల గ్రాంటుపై పారదర్శకత: జీవీఎంసీకి వచ్చే నిధుల వినియోగంపై స్పష్టత ఇవ్వాలి. 9.విశాఖ విమానాశ్రయం: డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుగా కొనసాగించాలి.

డిమాండ్ల అమలుకు కట్టుబడాలి ప్రజలకు ఇచ్చే హామీలు ఆచరణలోకి వచ్చినప్పుడే ప్రజాస్వామ్యంపై విశ్వాసం మరింత బలపడుతుందని బి.వి.రామ్ పేర్కొన్నారు. ప్రతి డిమాండ్‌పై స్పష్టమైన వైఖరిని వెల్లడించి, అమలుకు సంబంధించిన ప్రణాళికను ప్రకటించాలని కోరారు. నగర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చే నాయకత్వానికి మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

తొమ్మిది డిమాండ్ల అమలుకు హామీ తెలుగు శక్తి ప్రతిపాదించిన తొమ్మిది డిమాండ్లను ప్రజల కోసం తప్పకుండా అమలు చేసేందుకు కృషి చేస్తానని వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి హామీ ఇచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనంతరం వరుదు కల్యాణిని శాలువాతో సత్కరించిన బి.వి.రామ్, ఆమెకు అఖండ మెజార్టీతో విజయం సాధించేలా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్, జి.వీరభద్రరావు, పి.త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.

Dr.Srinivas lekkala

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: