విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అల్లూరి సీతారామ జిల్లా : అనకాపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పదవి రేసులో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న బచ్చుల తాతయ్య బాబు , మాజీ ఎమ్మెల్యే పిల్లా గోవింద సత్యనారాయణ, మాజీ జడ్పీ చైర్మన్ లాలం భవాని మధ్య గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం.. టీడీపీ నాయకులతో పాటు మరికొంతమంది కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) నేతల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చల్లో ఉన్న మరికొంతమంది వివరాలు: * పీలా గోవింద సత్యనారాయణ (మాజీ ఎమ్మెల్యే): అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అనుచరులు, వర్గీయులు కూడా ఈ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. * మండల ప్రజా పరిషత్ (MPP) మాజీ అధ్యక్షులు & సీనియర్ జడ్పీటీసీలు: జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి స్థానిక సంస్థల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం నియోజకవర్గాల పరిధిలోని పలువురు సీనియర్ జడ్పీటీసీ అభ్యర్థులు, కీలక నేతలు అధిష్టానం వద్ద తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. * కూటమి పొత్తుల సమీకరణాలు (జనసేన అభ్యర్థులు): అనకాపల్లి జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉండటం, ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుండి జనసేన నేత కొణతాల రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో Anakapalli Assembly constituency - Wikipedia, జనసేన నుంచి కూడా కొందరు కీలక స్థానిక సంస్థల నేతలు ఈ రేసులో భాగస్వామ్యం కోరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు GaviReddi RamaNaidu గవిరెడ్డి రామానాయుడు Ex-MLA, మాజీ జడ్పీ చైర్మన్ లాలం భాస్కరరావు, మరియు భవాణి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చలు తాతయ్య బాబు వంటి నేతల పేర్లు ముందంజలో ఉన్నప్పటికీ, సామాజిక సమీకరణాలు, నియోజకవర్గాల వారీగా ఉన్న రాజకీయ ప్రాధాన్యతలను బట్టి అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. సామాజిక సమీకరణాల వారీగా చూసుకుంటే ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో స్పీకర్ మరియు రెండు ఎంపీ పదవులు వేలమ సామాజిక వర్గానికి చెందిననేతలు ఉండటంతో కాపు సామాజివర్గానికి చెందిన టిడిపి జిల్లా అధ్యక్షుడు బచ్చుల తాతయ్య బాబు పేరు ప్రముఖంగా వినబడుతుంది టిడిపి అధిష్టానం మాత్రం సామాజిక సమీకరణాలు చూస్తే జడ్పీ చైర్మన్ పీఠం తాతయ్య బాబుకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి
మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, మాజీ ఎమ్మెల్యేగా, వెలమ సామజకవర్గానికి చెందిన నేతగా అన్నీ నియోజకవర్గాలులో బంధుత్వం ఉండటం, సోమ్యడుగా పేరు ఉండడం, పార్టీనీ నమ్ముకొని పనిచేయటం ఒక విధంగా పార్టీలో మంచి పేరు ఉండటం కూటమిలో ముఖ్యమైనటువంటి జడ్పీ చైర్మన్ పదవికి అర్హుడుగా మొదటిగా పేరు వినపడుతున్నది రామానాయుడుదే కొన్ని వర్గాల ద్వారా సమాచారం మరియు గుసగుసలు వినబడుతున్నాయి.మాడుగులలో పోటీ చేసిన ప్రతిసారి రాష్ట్ర వ్యాప్తంగా 2019 టిడిపి నేతలు హేమ హేమేలు భారీ మెజార్టీతో ఓడిపోతే, మాడుగుల్లో మాత్రం తక్కువ ఓట్లతో ఓడిపోయిన నేతగా పేరు ఉండటం ప్రజల్లో మమేకవటం రామానాయుడుకు ప్లస్ అనే చెప్పవచ్చు. అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తుందా లేదంటే జిల్లా పరిషత్ చైర్మన్ కి పంపిస్తుందా అనేది వెయిట్ చూడాల్సిందే.... అయితే రామానాయుడు జడ్పీ చైర్మన్ కి వెళ్తారా లేదా అనుకుంటే మళ్ళీ మాడుగుల నియోజకవర్గానికి 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్నది కొoత ఆసక్తికరంగా మారింది అని చెప్పవచ్చు
Admin
Viswas Tv