Wednesday, 28 October 2026 05:54:52 AM
# విశాఖ మేయర్ అభ్యర్థిగా వరదు కళ్యాణే బెస్ట్,బీవీ రామ్ నా మద్దతి కళ్యాణి గారికే # అవినీతి రాజకీయ నాయకుడు చేతి నుండి ప్రభుత్వ భూమిని కాపాడిన సిపిఎం నేత వెంకన్న, విశ్వాస్ టీవీ # జీవీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ ముక్కా శ్రావణి # దేవరాపల్లి జడ్పీటీసీ రెసులో ముచ్చటగా 8మంది!!పోటీ మాత్రం ఇద్దురు మధ్య!! # ఒకే ఇంట్లో నాలుగు పదవులు,!!అవును బాస్ # అనకాపల్లి జడ్పీ పీఠం ఎవరికి వరించెనో !!! అధిష్టానం దగ్గర దరఖాస్తు చేసుకున్నది నలుగురు అని సమాచారం!! # విశాఖ టిడిపి మేయర్ ఆభ్యర్థిగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని , మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోడలు మధ్య గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం!!! వైసి # 20లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రెవిన్యూ అధికారులు # విశాఖ మేయర్ కుర్చీ కోసం ముగ్గురు మాజీ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య పోరు....! # విశాఖ మేయర్ పీఠం కూటమిలో కాక!! గండి బాబ్జి వైపే అధిష్టానం చూపు # పెదపూడి సమస్యపై పీవీఎస్‌ఎన్‌ రాజు నిరవధిక నిరసన దీక్ష, కూటమిలో ఉంటూ కూటమికి చుక్కలు చూపిస్తున్న జనసేన నేత! # అనకాపల్లి జిల్లా టీడీపీ జడ్పీ చైర్మన్ పదివి రెసులో నలుగురు మధ్య తీవ్రపోటీ # ఒకవైపు డీజే ల మోత...... మరోవైపు మృత్యువాత # పోస్ట్ చిన్నది పైల్ కథ చాలా పెద్దది పరవాడలో దారుణం # 1980s ట్రెండ్ అదిరింది, జాగర్తగా ఉండవలిసిందే # *ఎ.యస్.యం ఇపార్క్ కు గోండుపాలెంలో భూసేకరణ ఆపాలని, మద్యత్తర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు* # వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!!

అవినీతి రాజకీయ నాయకుడు చేతి నుండి ప్రభుత్వ భూమిని కాపాడిన సిపిఎం నేత వెంకన్న, విశ్వాస్ టీవీ

రెండు దశాబ్దాల కల ప్రజల విజయం ఏడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి కాపాడిన ప్రజా సంఘాల నేతలు

Date : 25 October 2026 01:19 PM Views : 223

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : రెండు దశాబ్దాల పోరాటం ప్రజలే గెలిచారు ఏడున్నర ఎకరాల ప్రభుత్వ ఆక్రమణ భూమికి రెవెన్యూ అధికారులు దిగొచ్చారు పోయిన డిగ్రీ కాలేజ్, మోడల్ స్కూల్ మళ్లీ వస్తే భూమి రెడీగా ఉంది మామండల్లాన్ని కాపాడండి అంటున్న ప్రజా సంఘాలు సిపిఎం నేతలు,లోకసత్తా మాజీ నేతలు *ఎట్టకేలకు ప్రభుత్వ భూములకు బోర్డులు ఎర్పాటు!* *రెవెన్యూ అధికారులకు సిపిఎం,విశ్వాస్ టీవీ ధన్యవాదాలు* స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వాడాలి అంటున్న సిపిఎం నేత వెంకన్న అనకాపల్లి జిల్లా,దేవరాపల్లి మండలం,విశ్వాస్ టీవీ... దేవరాపల్లి మండల కేంద్రలోని తెనుగుబూడి రోడ్డులో*(ఏడు ఎకారాల ముప్పై సేంట్లు)* ప్రభుత్వ భూములకు రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు బోర్డు ఎర్పాటు చేసారు,దీనిపై సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి.వెంకన్న మరియు విశ్వాస్ టీవీ హర్షం వ్యక్తం చేస్తు రెవెన్యూ అదికారులకు ధన్యవాదాలు తెలియజేసారు, దశాబ్దాల కాలంగా చేసిన పోరాటం నేడు నెరవేరిందని పేర్కొన్నారు సిపిఎం నేత అన్నారు. పీజిఆర్ఎస్ లో దేవరాపల్లి తహశీల్దార్ తో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు విద్యాశాఖ మంత్రి లోకేష్ కు సిసిఎల్ఎకు పిర్యాదులు చేసిన పలితంగా దేవరాపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 280/1- 281/1లో గల పామ్ ఆయిల్ తోటలతో ఉన్న ప్రభుత్వ భూములన్ని అక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారని తెలిపారు.సర్వే నెంబరు 281/2, 6-88 సేంట్లు గౌరవ హైకోర్టులో ఉందని,ఇది కూడా త్వరలో తుదితీర్పు వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలం నుండి అక్రమణ దారుడు విచ్చల విడిగా అక్రమించు కోని సాగుచేసు కుంటున్నారని తెలిపారు. దీనిపై అనేక పర్యాయాలు సిపిఎం పార్టీ పిర్యాదు చేసిన మేరకు రెవెన్యూ అధికారులు బోర్డులు పెట్టారని ఇది మంచి పరిణామమని తెలిపారు. గతంలో ఈభూములు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దర్యాప్తు చేసి పంటలతో సహా ఈ భూములను స్వాదినం చేసుకుని అనేక సంవత్స రాలుగా స్థానిక రెవెన్యూ అధికారులు పర్యవేక్షణలో భూములు ఉంచారని అన్నారు. మద్యలో అక్రమణ దారుడు భూములు అక్రమించుకుని పామ్ ఆయిల్ ఫలసాయం తీసెసుకునేవారని తెలిపారు, దీనిపై గతంలో ఉన్న రెవెన్యూ అధికారులు కూడా భూములను రక్షించి ఫల సాయం అన్యాక్రాంతం ఆవ్వకుండా కాపాడటం, అన్యాక్రాంతం అయిన పామ్ అయిల్ పంటను ఆక్షన్ వేయడం జరిగిందని తెలిపారు, సిపిఎం పిర్యాదు మేరకు ప్రస్తుత రెవెన్యూ అధికారులు ఒక అడుగు ముందుకు వేసి బోర్డులు పెట్టారని తెలిపారు.

ఇది పూర్తిగా దేవరాపల్లి ప్రజలు హర్షించదగ్గ విషయమని తెలిపారు దేవరాపల్లిలో ప్రభుత్వ స్థలాలు లేవు అని చెప్పిన ఆనాటి,ఈనాటి అవినీతి రాజకీయనాయలు వల్ల నవోదయ పాఠశాల,మోడల్ స్కూల్,స్పోర్ట్స్ స్కూల్, డిగ్రీ కాలేజీ వంటి పాఠశాలలు అన్ని వేరే ప్రాంతాలకు తరిలి పోయాయని తెలిపారు, సర్వే నెంబరు 20లో 38 ఎకారాలు అన్యాక్రాంతం అయితే రెవెన్యూ అధికారులతో సిపిఎం పార్టీ 16 సంవత్సరాలు కోర్టుకు తిరిగి భూములు సాదించిందని దీని పలితంగా నేడు జగనన్న కోలణితో పాటు 10 ఎకారాల్లో సోలార్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మరో 15 ఎకారాలు ప్రభుత్వ భూమి ప్రభుత్వ అవసారాలకు ఉపయోగించు కునెందుకు సిద్దంగా ఉందన్నారు, ఇప్పుడు బోర్డులు పెట్టిన భూముల్లో ఫలసాయం అన్యాక్రాంతం అవ్వకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.భవిష్యత్తులో ఈభూములను కూడా ప్రభుత్వ అవసారాలకు ఉపయోగించి డిగ్రీ కాలేజీ, హస్టల్స్,స్కూల్స్ వంటి వాటికీ ఉపయోగించినప్పడె దేవరాపల్లి మండల కేంద్రం అన్ని విధాలుగా అబివృద్ది చేందుతుందని,తెలిపారు,ఇన్నేళ్లుగా అక్రమదారుని చేతుల్లో ప్రభుత్వ భూములు ఉండిపోవడం వల్లనే దేవరాపల్లికి రావలిసిన ప్రభుత్వ పాఠశాలలు అన్ని వేరే ప్రాంతానికి వెళ్ళి పోవడం వల్ల తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వo చిత్తశుద్ధితో వ్వహరించి ఈభూములను ప్రభుత్వ ప్రజా అవసారాలకు ఉపయోగించాలని దేవరాపల్లిని అన్ని విధాలుగా అబివృద్ది చేయాలని వెంకన్న ప్రభుత్వాన్ని అదికారులను కోరారు...

Dr.Srinivas lekkala

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :