Wednesday, 28 October 2026 05:54:53 AM
# విశాఖ మేయర్ అభ్యర్థిగా వరదు కళ్యాణే బెస్ట్,బీవీ రామ్ నా మద్దతి కళ్యాణి గారికే # అవినీతి రాజకీయ నాయకుడు చేతి నుండి ప్రభుత్వ భూమిని కాపాడిన సిపిఎం నేత వెంకన్న, విశ్వాస్ టీవీ # జీవీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ ముక్కా శ్రావణి # దేవరాపల్లి జడ్పీటీసీ రెసులో ముచ్చటగా 8మంది!!పోటీ మాత్రం ఇద్దురు మధ్య!! # ఒకే ఇంట్లో నాలుగు పదవులు,!!అవును బాస్ # అనకాపల్లి జడ్పీ పీఠం ఎవరికి వరించెనో !!! అధిష్టానం దగ్గర దరఖాస్తు చేసుకున్నది నలుగురు అని సమాచారం!! # విశాఖ టిడిపి మేయర్ ఆభ్యర్థిగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని , మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోడలు మధ్య గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం!!! వైసి # 20లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రెవిన్యూ అధికారులు # విశాఖ మేయర్ కుర్చీ కోసం ముగ్గురు మాజీ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య పోరు....! # విశాఖ మేయర్ పీఠం కూటమిలో కాక!! గండి బాబ్జి వైపే అధిష్టానం చూపు # పెదపూడి సమస్యపై పీవీఎస్‌ఎన్‌ రాజు నిరవధిక నిరసన దీక్ష, కూటమిలో ఉంటూ కూటమికి చుక్కలు చూపిస్తున్న జనసేన నేత! # అనకాపల్లి జిల్లా టీడీపీ జడ్పీ చైర్మన్ పదివి రెసులో నలుగురు మధ్య తీవ్రపోటీ # ఒకవైపు డీజే ల మోత...... మరోవైపు మృత్యువాత # పోస్ట్ చిన్నది పైల్ కథ చాలా పెద్దది పరవాడలో దారుణం # 1980s ట్రెండ్ అదిరింది, జాగర్తగా ఉండవలిసిందే # *ఎ.యస్.యం ఇపార్క్ కు గోండుపాలెంలో భూసేకరణ ఆపాలని, మద్యత్తర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు* # వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!!

అనకాపల్లి జడ్పీ పీఠం ఎవరికి వరించెనో !!! అధిష్టానం దగ్గర దరఖాస్తు చేసుకున్నది నలుగురు అని సమాచారం!!

మాజీ జడ్పీ చైర్మన్ లాలం భవాని భాస్కర్, మరియు పి వి జె కుమార్ సతీమణి సత్యవతి మధ్య పోటీ!!

Date : 14 October 2026 02:34 PM Views : 251

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్రంగా మారుతూ ఉన్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠానికి మహిళా రిజర్వేషన్ ఖరారు కావడంతో అనకాపల్లి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఎంతో కాలంగా పదోపే ఆశలు పెట్టుకున్న పలువురు నాయకులు రాజకీయ లెక్కలు మారిపోగా ఇప్పుడు తన కుటుంబాల్లోని మహిళలకు అవకాశం కల్పించింది కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం ముమ్మురంగా సాగుతూ ఉంది. మరోవైపు రాజకీయ అనుభవం ప్రజల్లో గుర్తింపు పార్టీ పట్ల నిబద్ధత కలిగిన మహిళ నాయకురాలు అవకాశం ఇవ్వాలని అభిప్రాయాలు కూడా పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నలుగురు నేతలు జిల్లా పరిషత్ చైర్మన్ రేస్ లో మేము ఉన్నామని. అధిష్టానం దగ్గర దరఖాస్తు పెట్టుకున్నట్టు సమాచారం. మొదటి వరుసలో లాలం భవాని భాస్కర్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి.విజే కుమార్ సతీమణి సత్యవతి,, అనూహ్యంగా కొత్త పేరు మాజీ జడ్పిటిసి దేవరాపల్లి మండలం గాలి వరలక్ష్మి, మాజీ ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.. ప్రముఖంగా లాలం భాస్కర్ భవాని మరియు పివిజే కుమార్ సతీమణి సత్యవతిల మధ్య రసవత్తంగా నువ్వా నేనా అన్నట్టు గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే అధినేత దగ్గర పావులు కలుపుతూ విజయవాడలో పాగా వేసినట్టు సమాచారం.. జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ (లాలం భవాని భాస్కర్) ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం వస్తుంది.. ఎలమంచిలి నియోజకవర్గo టిడిపి పెద్దదిక్కుగా ఉన్న లాలం భాస్కరరావు ఫ్యామిలీ 1985 సంవత్సరం నుండి రాజకీయాల్లో ఉంటూ టిడిపికి వెన్నుదున్నుగా ఉన్న లాలం ఫ్యామిలీ, లాలం కోడూరు గ్రామంలోని సర్పంచ్ గా, రాంబల్లి మండల ఎంపీపీగా, రెండుసార్లు జడ్పిటిసిగా పనిచేసిన అనుభవం, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గా లాలం భవాని సేవలందించారు. జిల్లా రాజకీయాల్లో మహిళ రిజర్వేషన్ రావడంతో మొదటి వరుసలో లాలం భవాని పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నది.అధినేత పిలుపుమేరకు విజయవాడలో లాలం ఫ్యామిలీ అంతా ఉన్నట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో లాలం భవానికే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వరిస్తుందని సమాచారం...సన్నిహితులు రాజకీయ వర్గాలు అనుకుంటూ ఉన్నారు.

చిడికాడ మండల మాజీ జెడ్పిటిసి పీవీజే కుమార్ సతీమణి,సత్యవతి రాజకీయ అనుభవం ఐదు సంవత్సరాలు పాటు జడ్పిటిసి గా సేవలు , మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శిష్యుడు, శిష్యులుగా పేరు, అనుభవం నమ్ముకున్న పార్టీకి వమ్ము చేయకుండా పార్టీలో ఉంటూ సేవలందిస్తున్న సత్యవతికి జడ్పీ చైర్మన్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.ఇప్పటికే ఫ్యామిలీ మొత్తం విజయవాడలో పార్టీ అధినేతను కలవటానికి వెళ్ళినట్టు సమాచారం.

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మేజర్ పంచాయితీ మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ జడ్పిటిసి గాలి వరలక్ష్మి ఇప్పటికే పావులు కదిపినట్టు తెలుస్తూ ఉన్నది. జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని మంత్రి లోకేష్ గారికి విన్నపిచ్చుకున్నట్టు సమాచారం వస్తుంది. గాలి వరలక్ష్మి జడ్పిటిసిగా, స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ గా, విజిలెన్స్ కమిటీ బోర్డు మెంబర్ గా, జడ్పిటిసి గా సేవలందించిన సమయములో బెస్ట్ జడ్పిటిసి అవార్డు నారా లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 2017 18 లో అవార్డు తీసుకోవడం జరిగింది. 2019 2024 జడ్పిటిసిగా పోటీ చేస్తే ఆనాడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక సంస్థలు ఎన్నికలు బాయ్ కట్ చేయమంటే మొదటిగా అనకాపల్లి జిల్లాలోని జడ్పిటిసిగా పోటీ చేసి బాయ్ కట్ చేశారు. నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ రెసులో ఉన్నానని ఇప్పటికే మంత్రి నారా లోకేష్ దృష్టిలో పెట్టినట్టు సమాచారం.. దరఖాస్తు చేసుకున్నట్టు వినిపిస్తూ ఉన్నది... జిల్లా పరిషత్ చైర్మన్ రసవత్తర పోరులో అనూహ్యoగా రెండు కొత్త పేర్లు రావటం, ఒకపక్క మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ సతీమణి మధ్య పోటీ రసవత్రంగా మారింది. ఎవరికి వరిస్తుందో మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది

Dr.Srinivas lekkala

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :