Wednesday, 28 October 2026 05:55:04 AM
# విశాఖ మేయర్ అభ్యర్థిగా వరదు కళ్యాణే బెస్ట్,బీవీ రామ్ నా మద్దతి కళ్యాణి గారికే # అవినీతి రాజకీయ నాయకుడు చేతి నుండి ప్రభుత్వ భూమిని కాపాడిన సిపిఎం నేత వెంకన్న, విశ్వాస్ టీవీ # జీవీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ ముక్కా శ్రావణి # దేవరాపల్లి జడ్పీటీసీ రెసులో ముచ్చటగా 8మంది!!పోటీ మాత్రం ఇద్దురు మధ్య!! # ఒకే ఇంట్లో నాలుగు పదవులు,!!అవును బాస్ # అనకాపల్లి జడ్పీ పీఠం ఎవరికి వరించెనో !!! అధిష్టానం దగ్గర దరఖాస్తు చేసుకున్నది నలుగురు అని సమాచారం!! # విశాఖ టిడిపి మేయర్ ఆభ్యర్థిగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని , మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోడలు మధ్య గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం!!! వైసి # 20లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రెవిన్యూ అధికారులు # విశాఖ మేయర్ కుర్చీ కోసం ముగ్గురు మాజీ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య పోరు....! # విశాఖ మేయర్ పీఠం కూటమిలో కాక!! గండి బాబ్జి వైపే అధిష్టానం చూపు # పెదపూడి సమస్యపై పీవీఎస్‌ఎన్‌ రాజు నిరవధిక నిరసన దీక్ష, కూటమిలో ఉంటూ కూటమికి చుక్కలు చూపిస్తున్న జనసేన నేత! # అనకాపల్లి జిల్లా టీడీపీ జడ్పీ చైర్మన్ పదివి రెసులో నలుగురు మధ్య తీవ్రపోటీ # ఒకవైపు డీజే ల మోత...... మరోవైపు మృత్యువాత # పోస్ట్ చిన్నది పైల్ కథ చాలా పెద్దది పరవాడలో దారుణం # 1980s ట్రెండ్ అదిరింది, జాగర్తగా ఉండవలిసిందే # *ఎ.యస్.యం ఇపార్క్ కు గోండుపాలెంలో భూసేకరణ ఆపాలని, మద్యత్తర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు* # వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!!

ఒకే ఇంట్లో నాలుగు పదవులు,!!అవును బాస్

బాస్ మజాకా!!!

Date : 16 October 2026 05:25 PM Views : 115

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : Viswastv.Com ఒకే ఇంట్లో నాలుగు పదవులు! అవును బాస్... ఇది అందరికీ దక్కే ఛాన్స్ కాదు, కోట్లలో ఒక్కరికే వచ్చే అదృష్టం! ఇది ఎక్కడో కాదు... మన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సీనియార్టీ ఉంటే పవర్ ఎలా ఉంటుందో చూపిస్తూ... చింతకాయల అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీ నర్సీపట్నంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయింది! బాస్... పవర్ అంటే ఎలా ఉండాలి? పలకరిస్తే పదవులు పరుగెత్తుకుంటూ రావాలి! ‘టిడిపి అంటేనే మజా... అక్కడ పర్పత్ ఉండాలి, సీనియార్టీ ఉండాలి’ అని నిరూపించారు నర్సీపట్నం కింగ్ మేకర్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు! ఒకే ఇంట్లో నాలుగు పదవులా? ఇది నిజంగా నెక్ట్స్ లెవెల్ గురూ! ఇప్పటికే ఒకవైపు అయ్యన్నపాత్రుడు గారు ఎమ్మెల్యేగా, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా టాప్ పొజిషన్‌లో ఉంటే... మరోవైపు ఆయన తనయుడు చింతకాయల విజయ్ రాజ్యసభ ఎంపీగా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు! ఇదంతా ఒకెత్తయితే... ఇప్పుడు అసలైన ట్విస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్‌తో వచ్చింది బాస్! నర్సీపట్నం మున్సిపాలిటీలో మహిళా రిజర్వేషన్ రావడమే ఆలస్యం... 'తగ్గేదే లే' అంటూ అయ్యన్నపాత్రుడు గారి సతీమణి నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్‌గా ఇవాళే గ్రాండ్‌గా నామినేషన్ దాఖలు చేసేశారు! అంతటితో ఆగారా? అస్సలు లేదు! అయ్యన్నపాత్రుడు గారి కోడలు గారు కూడా 31వ వార్డు కౌన్సిలర్‌గా నామినేషన్ వేసి రేసులోకి దూసుకొచ్చారు! అంటే ఏంటి? ఎమ్మెల్యే, స్పీకర్, ఎంపీ, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్... అబ్బబ్బా! ఒకే ఫ్యామిలీ, ఒకే ఇల్లు... కానీ ఏకంగా నాలుగు భారీ పదవులు! ఇదంతా చూస్తుంటే నర్సీపట్నం జనాల నోట ఒకటే మాట వినిపిస్తోంది... 'ఇది అందరికీ దక్కదు గురూ... నోటికోటికో ఒక్కలకే ఇలాంటి అవకాశం ఉంటది!' సీనియర్ నేతగా అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీ నర్సీపట్నంలో సాగిస్తున్న ఈ పవర్ పాలిటిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరి ఈ 'ఫోర్ ఇన్ వన్' ఫ్యామిలీ మజాపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ రూపంలో గట్టిగా చెప్పేయండి. చూస్తూనే ఉండండి... మీ ఫేవరెట్ ట్రెండింగ్ విశ్వాస్ టీవీ లో !"

నామినేషన్ వేసిన అయ్యన్నపాత్రుడు సతీమణి,కోడలు

Dr.Srinivas lekkala

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :