విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : 1980's trend ఎక్కడ చూసినా 80's లుక్‌దే హవా ! AIతో 40 ఏళ్లు వెనక్కి వెళ్తున్న నెటిజన్లు నిన్నటి ఫొటోలకు.. నేటి టెక్నాలజీ టచ్ ! ఒకప్పుడు ఆల్బమ్‌లో కనిపించిన ఫొటోలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి! 1980లు ఎలా ఉండేవి..? ఆ కాలంలో మనం ఎలా కనిపించేవాళ్లం..? ఆ రోజుల్లో ఫ్యాషన్ ఎలా ఉండేది..? ఈ ప్రశ్నలకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం చెబుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో AI 1980s ఫోటో ట్రెండ్ దుమ్మురేపుతోంది. సాధారణంగా ఉన్న ఒక ఫొటోను AI టూల్‌కు అప్‌లోడ్ చేస్తే చాలు.. ఒక్కసారిగా ఆ వ్యక్తిని 1980ల నాటి లుక్‌లోకి మార్చేస్తోంది. పెద్ద జుట్టు.. భారీ కాలర్లు.. రంగురంగుల దుస్తులు.. ఓవర్‌సైజ్‌డ్ సన్‌గ్లాసెస్.. పాతకాలపు స్కూటర్లు.. ఫిల్మ్ కెమెరా ఎఫెక్ట్....అంతేకాదు.. పాత ఫొటోల్లో కనిపించే గ్రెయిన్, ఫేడ్ అయిన కలర్స్, సాఫ్ట్ లైటింగ్ కూడా AI జోడిస్తోంది. దీంతో ఫొటో నిజంగానే 1980ల్లో తీసినట్టుగా కనిపిస్తోంది. ఈ ట్రెండ్‌కు సామాన్య నెటిజన్లే కాదు.. సెలబ్రిటీలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు కూడా ఫిదా అవుతున్నారు. తమ ప్రస్తుత ఫొటోలను 80ల నాటి స్టైల్‌లో మార్చుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొందరు మాత్రం AI ఫొటోలకు బదులుగా తమ నిజమైన 1980ల ఫొటోలను బయటకు తీస్తున్నారు. అలా సోషల్ మీడియాలో ఇప్పుడు రెండు తరాల మధ్య ఆసక్తికరమైన పోలిక మొదలైంది. అప్పటి ఒరిజినల్ ఫొటో.. ఇప్పటి AI ఫొటో.. ఏది బెటర్..? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. AIలో 80's ఎందుకు ఇంత వైరల్ ? దీనికి ప్రధాన కారణం నోస్టాల్జియా. 1980ల్లో పెరిగిన వాళ్లకు ఇది పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తుంటే.. యువతకు మాత్రం తాము చూడని కాలాన్ని ఊహించుకునే అవకాశం ఇస్తోంది. అంటే... పాతకాలపు జ్ఞాపకాలు + కొత్తకాలపు టెక్నాలజీ = AI 80's ట్రెండ్! అన్నమాట. ఇక సోషల్ మీడియాలో ఫొటో పెట్టి లైక్స్, కామెంట్స్ పొందాలనే ఆసక్తి ఈ ట్రెండ్‌ను మరింత వేగంగా వైరల్ చేస్తోంది. ఈ ట్రెండ్ సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. ప్రముఖ రాజకీయ నాయకుల 80ల నాటి లుక్స్‌తో AI ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ ట్రెండ్ రాజకీయ అభిమానుల మధ్య మిమ్ వార్‌కు కూడా దారితీసింది. అంటే.. AI ఇప్పుడు కేవలం ఫొటో ఎడిటింగ్ టూల్ కాదు..సోషల్ మీడియా కమ్యూనికేషన్‌లోనూ ఒక కొత్త ఆయుధంగా మారుతోందా? అన్న ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. ఒకే ఫొటోతో... 80's హీరో లుక్.. 80's హీరోయిన్ లుక్.. వింటేజ్ ఫ్యామిలీ ఆల్బమ్.. రెట్రో వెడ్డింగ్ ఫొటో.. బాలీవుడ్ మూవీ స్టిల్.. పాతకాలపు గ్రామీణ వాతావరణం....ఇలా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఫొటోషాప్ లేదా ప్రొఫెషనల్ ఎడిటింగ్ అవసరమయ్యే పనులను ఇప్పుడు AI చాలా సులభంగా మార్చేస్తోంది. కానీ.. ఒక చిన్న అలర్ట్! ఈ ట్రెండ్ సరదాగా ఉన్నప్పటికీ.. మన ఫొటోలను AI ప్లాట్‌ఫార్మ్‌లకు అప్‌లోడ్ చేసేటప్పుడు ప్రైవసీ, డేటా వినియోగం గురించి తెలుసుకోవడం మంచిదే. ఫొటోను ఎక్కడ అప్‌లోడ్ చేస్తున్నాం..? ఆ ప్లాట్‌ఫార్మ్ మన డేటాను ఎలా ప్రాసెస్ చేస్తుంది..? ఏ నిబంధనలకు మనం అంగీకరిస్తున్నాం..? అన్నది కూడా గమనించాలి. నిన్నటి జ్ఞాపకాలకు.. నేటి టెక్నాలజీ తోడైంది. 1980లు పోయాయి..కానీ 80's స్టైల్ మాత్రం తిరిగొచ్చింది! అప్పట్లో ఫిల్మ్ కెమెరా.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాలం మారింది.. టెక్నాలజీ మారింది.. కానీ 80's క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు .........................................
Admin
Viswas Tv