Wednesday, 28 October 2026 05:55:03 AM
# విశాఖ మేయర్ అభ్యర్థిగా వరదు కళ్యాణే బెస్ట్,బీవీ రామ్ నా మద్దతి కళ్యాణి గారికే # అవినీతి రాజకీయ నాయకుడు చేతి నుండి ప్రభుత్వ భూమిని కాపాడిన సిపిఎం నేత వెంకన్న, విశ్వాస్ టీవీ # జీవీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ ముక్కా శ్రావణి # దేవరాపల్లి జడ్పీటీసీ రెసులో ముచ్చటగా 8మంది!!పోటీ మాత్రం ఇద్దురు మధ్య!! # ఒకే ఇంట్లో నాలుగు పదవులు,!!అవును బాస్ # అనకాపల్లి జడ్పీ పీఠం ఎవరికి వరించెనో !!! అధిష్టానం దగ్గర దరఖాస్తు చేసుకున్నది నలుగురు అని సమాచారం!! # విశాఖ టిడిపి మేయర్ ఆభ్యర్థిగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని , మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోడలు మధ్య గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం!!! వైసి # 20లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రెవిన్యూ అధికారులు # విశాఖ మేయర్ కుర్చీ కోసం ముగ్గురు మాజీ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య పోరు....! # విశాఖ మేయర్ పీఠం కూటమిలో కాక!! గండి బాబ్జి వైపే అధిష్టానం చూపు # పెదపూడి సమస్యపై పీవీఎస్‌ఎన్‌ రాజు నిరవధిక నిరసన దీక్ష, కూటమిలో ఉంటూ కూటమికి చుక్కలు చూపిస్తున్న జనసేన నేత! # అనకాపల్లి జిల్లా టీడీపీ జడ్పీ చైర్మన్ పదివి రెసులో నలుగురు మధ్య తీవ్రపోటీ # ఒకవైపు డీజే ల మోత...... మరోవైపు మృత్యువాత # పోస్ట్ చిన్నది పైల్ కథ చాలా పెద్దది పరవాడలో దారుణం # 1980s ట్రెండ్ అదిరింది, జాగర్తగా ఉండవలిసిందే # *ఎ.యస్.యం ఇపార్క్ కు గోండుపాలెంలో భూసేకరణ ఆపాలని, మద్యత్తర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు* # వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!!

పెదపూడి సమస్యపై పీవీఎస్‌ఎన్‌ రాజు నిరవధిక నిరసన దీక్ష, కూటమిలో ఉంటూ కూటమికి చుక్కలు చూపిస్తున్న జనసేన నేత!

Date : 08 October 2026 09:13 PM Views : 91

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : పెదపూడి సమస్యపై పీవీఎస్‌ఎన్‌ రాజు నిరవధిక నిరసన దీక్ష బుచ్చయ్యపేట విశ్వాస్ టీవీ : గత ప్రభుత్వ హయాంలో కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిబంధనలకు విరుద్ధంగా రీ-సర్వే నిర్వహించి, రెవెన్యూ రికార్డుల్లో తప్పుడు నమోదులు చేయడం వల్ల పెదపూడి గ్రామపంచాయతీ పరిధిలోని గోకివాడ సత్తిబాబు అలియాస్ మహేష్ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ పీవీఎస్‌ఎన్‌ రాజు ఆరోపించారు. రీ-సర్వేలో జరిగిన తప్పిదాల కారణంగా మహేష్ కుటుంబం నివసిస్తున్న ఇంటికి వెళ్లే రహదారి మూసివేయబడిందని, ఇంటికి వెళ్లే మార్గానికి అడ్డంగా గోడ నిర్మించడంతో దాదాపు మూడేళ్లుగా ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన తెలిపారు. సమస్యను పరిష్కరించాలని బాధిత కుటుంబం పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ నేటికీ పరిష్కారం లభించలేదన్నారు. అత్యంత ఇబ్బందుల్లో ఉన్న మహేష్ కుటుంబాన్ని స్వయంగా కలిసిన పీవీఎస్‌ఎన్‌ రాజు, వారి పరిస్థితిని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో మహేష్ కుటుంభం మరోచోట తాటాకుల షెడ్డు కింద దుర్భర పరిస్థితుల్లో జీవించాల్సి వస్తోందని బాధిత కుటుంబ సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా మహేష్ కుటుంబం అనేకసార్లు అధికారులకు తమ గోడును విన్నవించినప్పటికీ, గత రెండున్నర సంవత్సరాలుగా అధికారులు స్పందించకపోవడం, తగిన చర్యలు తీసుకోకపోవడంపై పీవీఎస్‌ఎన్‌ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై మండల రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి, సంబంధిత రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితులను గుర్తించాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తేదీ 12.10.2026 సోమవారం లోగా రెవెన్యూ అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే, బుచ్చయ్యపేట మండల రెవెన్యూ కార్యాలయం వద్ద నిరవధిక నిరసన దీక్షకు దిగుతానని పీవీఎస్‌ఎన్‌ రాజు ప్రకటించారు.

Dr.Srinivas lekkala

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :