విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖ మేయర్ పీఠం కోసం.. కూటమిలో కాక! బీసీ కోటాకే బాబు మొగ్గు..? గండి బాబ్జి వైపే అధిష్టానం చూపు..? మహా విశాఖ నగరపాలక సంస్థలో మేయర్ పీఠం ఎవరికి దక్కబోతోంది..? కూటమి పార్టీల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క మేయర్ కుర్చీ కోసం.. టీడీపీలో నలుగురు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. సామాజిక సమీకరణాలు.. రాజకీయ బలాబలాలు.. గెలుపు అవకాశాలు.. అన్నింటినీ బేరీజు వేసుకుంటున్న టీడీపీ అధిష్టానం.. బీసీ వైపే మొగ్గు చూపుతోందా..? అదే నిజమైతే.. బీసీ సామాజిక వర్గంలో ఎవరి వైపు పార్టీ అధిష్టానం చూస్తోంది..? గండి బాబ్జి.. బండారు అప్పలనాయుడు.. పిల్లా గోవింద సత్యనారాయణ.. లేక పల్లా శ్రీనివాసరావు సతీమణి..? ఇక ఓసీ కోటాలో మేయర్ పీఠం కోసం పోటీ పడుతున్న గంటా రవితేజ, పట్టాభిరామ్ పేర్లు ఎందుకు వెనక్కి వెళ్లినట్లు కనిపిస్తున్నాయి..? అసలు చంద్రబాబు దగ్గరకు వెళ్లి మేయర్ పదవి కోసం విజ్ఞప్తి చేసిన ఆ ఎమ్మెల్యే తనయుడు ఎవరు..? ఆయనకు చంద్రబాబు ఏం చెప్పారన్నది ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. మేయర్ పీఠం కోసం కూటమిలో సాగుతున్న ఆ అంతర్గత పోరేంటో చూద్దాం.. మేయర్ పీఠంపై ఎవరి కన్ను..? మహా విశాఖ మేయర్ పీఠం.. ఇప్పుడు కూటమి రాజకీయాల్లో హాట్ సీట్‌గా మారింది. ఒక్క కుర్చీ కోసం.. పలువురు నేతలు తమ తమ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మేయర్ పీఠం తమ వర్గానికే దక్కాలని.. తమకే అవకాశం ఇవ్వాలని.. నేతలు అధిష్టానం వద్ద తమ వాదన వినిపిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ రేసులో ప్రధానంగా ఓసీ, బీసీ సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. ఓసీకి ఛాన్స్ ఉందా..? ఓసీ సామాజిక వర్గం నుంచి మేయర్ పదవికి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్టాభిరామ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య పోటీపై టీడీపీ వర్గాల్లో చర్చ జరిగినట్టు సమాచారం. అయితే.. మేయర్ పీఠాన్ని బీసీ వర్గానికి కేటాయించే అవకాశం ఉందన్న సంకేతాలు రావడంతో.. ఓసీ రేసు కాస్త సైలెంట్ అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. మేయర్ పీఠం కోసం ఓ ఎమ్మెల్యే తనయుడు నేరుగా సీఎం చంద్రబాబును కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు కూడా టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈసారి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదంటూ చంద్రబాబు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే ఇప్పుడు టీడీపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీసీ కోటాపై ఎందుకింత పట్టుదల..? ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. గతంలో వైసీపీ హయాంలో విశాఖ మేయర్ పీఠం బీసీ సామాజిక వర్గానికి దక్కింది. ఇప్పుడు అదే సామాజిక సమీకరణాన్ని టీడీపీ కూడా కొనసాగించాలన్న వాదన పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. “వైసీపీ బీసీకి ఇచ్చింది.. టీడీపీ కూడా బీసీకి ఇస్తేనే సామాజికంగా, రాజకీయంగా సరైన సంకేతం వెళ్తుంది” అన్న అభిప్రాయం అధిష్టానం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. విశాఖలో బీసీ సామాజిక వర్గాల ఓటు బ్యాంకు, కార్పొరేటర్ల మద్దతు, స్థానికంగా నేతల ప్రభావం.. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బీసీలో నలుగురు.. ఎవరు బలమైన అభ్యర్థి..? బీసీ కోటా ఖరారైతే.. మరి మేయర్ పీఠం ఎవరికి..? ఇక్కడే అసలు పోటీ మొదలైంది. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి.. మాజీ మంత్రి తనయడు బండారు అప్పలనాయుడు.. మాజీ ఎమ్మెల్యే పిల్లా గోవింద సత్యనారాయణ.. పల్లా శ్రీనివాసరావు సతీమణి.. ఈ నాలుగు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే.. వీరిలో ఎవరికి కార్పొరేటర్ల మద్దతు ఉంది..? ఎవరికి ప్రజల్లో ఇమేజ్ ఉంది..? ఎవరికి పార్టీ క్యాడర్ అండగా నిలుస్తుంది..? మేయర్ ఎన్నిక సమయంలో క్రాస్ ఓటింగ్‌కు అవకాశం లేకుండా ఎవరు వ్యవహరించగలరు..? అనే అంశాలపై టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వెలమ వర్సెస్ గవర.. యాదవ్ సమీకరణం! బీసీ కోటాలోనూ ఒకే సామాజిక వర్గం కాదు. వెలమ.. గవర.. యాదవ్.. ఈ మూడు సామాజిక వర్గాల మధ్య మేయర్ పీఠం కోసం పోటీ ఆసక్తికరంగా మారింది. వెలమ సామాజిక వర్గం నుంచి గండి బాబ్జి, బండారు అప్పలనాయుడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ రాజకీయంగా అనుభవం ఉన్న నేతలే. అయితే.. విశాఖ రాజకీయాల్లో మేయర్ ఎన్నికకు అవసరమైన కార్పొరేటర్ల మద్దతు.. పార్టీ క్యాడర్‌తో సమన్వయం.. ప్రజల్లో ఉన్న పట్టు.. వంటి అంశాల్లో గండి బాబ్జికే పైచేయి ఉందన్న చర్చ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. గండి బాబ్జి వైపే అధిష్టానం చూపు..? అందుకే.. బీసీ కోటా ఖరారైతే గండి బాబ్జి పేరే ముందంజలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. “గెలిచే సామర్థ్యం ఉన్న వ్యక్తికే మేయర్ పీఠం ఇవ్వాలి” అన్న ఫార్ములాను టీడీపీ అధిష్టానం అనుసరిస్తే.. గండి బాబ్జి రేసులో ముందుండే అవకాశం ఉందన్నది పార్టీ వర్గాల మాట. అయితే.. ఇది అధికారిక నిర్ణయం కాదు. అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే వరకు.. ఎవరి పేరు ఖరారవుతుందో చెప్పలేని పరిస్థితి. గవర సామాజిక వర్గం నుంచి పిల్లా గోవింద సత్యనారాయణ ఇక గవర సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పిల్లా గోవింద సత్యనారాయణ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజకీయ అనుభవం.. పార్టీతో ఉన్న అనుబంధం.. వంటి అంశాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే.. మేయర్ ఎన్నికలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కార్పొరేటర్ల వైఖరి ఎలా ఉంటుంది..? టీడీపీ కార్పొరేటర్లంతా ఒకే మాటపై నిలబడతారా..? అన్నది కూడా కీలకంగా మారింది. ఒకవేళ అంతర్గత విభేదాలు బయటపడితే.. మేయర్ పీఠం చేజారే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన టీడీపీ వర్గాల్లో ఉన్నట్టు సమాచారం. అసలు బాబు వ్యూహం ఏంటి..? అందుకే టీడీపీ అధిష్టానం ఇప్పుడు ఒక్క పేరును ఎంపిక చేయడం కంటే.. ఎవరైతే కార్పొరేటర్లను ఏకతాటిపైకి తీసుకురాగలరు..? ఎవరైతే ప్రజల్లో ఆమోదం పొందగలరు..? ఎవరైతే మేయర్ ఎన్నికలో పార్టీకి గెలుపు అందించగలరు..? అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణం ఒకవైపు.. రాజకీయ బలం మరోవైపు.. కార్పొరేటర్ల మద్దతు ఇంకోవైపు.. ఈ మూడు లెక్కల్లో ఎవరు ముందుంటే.. విశాఖ మేయర్ పీఠం వారినే వరించే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి.. విశాఖ మేయర్ పీఠం ఇప్పుడు కేవలం ఒక పదవి కాదు.. కూటమి పార్టీల్లో రాజకీయ ఆధిపత్యానికి ప్రతీకగా మారింది. ఓసీనా..? బీసీనా..? బీసీ అయితే వెలమా..? గవరా..? యాదవా..? గండి బాబ్జినా..? బండారు అప్పలనాయుడా..? పిల్లా గోవింద సత్యనారాయణా..? లేక పల్లా శ్రీనివాసరావు సతీమణినా..? ఈ నలుగురిలో అధిష్టానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠ.
మేయర్ పీఠంపై తుది నిర్ణయం ఎప్పుడు వస్తుంది..? ఎవరికి బాబు ఆశీస్సులు దక్కుతాయి..? ఎవరి రాజకీయ లెక్కలు తారుమారవుతాయి..? విశాఖ కూటమి రాజకీయాల్లో.. మేయర్ కుర్చీ చుట్టూ ముదురుతున్న ఈ పోరు.. రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది.కాల నిర్ణయమే అని రాజకీయ విశ్లేషకలు అంటున్నారు.
Admin
Viswas Tv